అచ్చెన్నాయుడి లెటర్ హెడ్‌లతోనే అంతా..
దిశ, వెబ్‌డెస్క్ ఏపీ ఈఎస్‌ఐ కొనుగోళ్ల కుంభకోణంలో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా సుమారు రూ.150కోట్ల మేర అవినీతి జరిగినట్లు అధికారులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడి లెటర్ హెడ్ సిఫార్సుల ఆధారంగానే ఆయా కంపెనీల నుంచి ఈఎస్‌ఐ కొనుగోళ్లు చేపట్టిందని తెలుస్తోంది.ఈ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసినట్టు ఏసీబీ జేడీ రవికుమార్ తెలిపారు.అయితే, ఈ గోల్‌మాల్‌లో సచివాలయ ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. […]
దిశ, వెబ్‌డెస్క్
ఏపీ ఈఎస్‌ఐ కొనుగోళ్ల కుంభకోణంలో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా సుమారు రూ.150కోట్ల మేర అవినీతి జరిగినట్లు అధికారులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడి లెటర్ హెడ్ సిఫార్సుల ఆధారంగానే ఆయా కంపెనీల నుంచి ఈఎస్‌ఐ కొనుగోళ్లు చేపట్టిందని తెలుస్తోంది.ఈ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసినట్టు ఏసీబీ జేడీ రవికుమార్ తెలిపారు.అయితే, ఈ గోల్‌మాల్‌లో సచివాలయ ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. కేసు దర్యాప్తులో భాగంగా వారిని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని జేడీ రవికుమార్ తెలిపారు.