JNTU గర్ల్స్ హాస్టల్‌లో 15 మందికి పాజిటివ్

దిశ, వెబ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. తాజాగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జవహార్ లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ (JNTU) అమ్మాయిల హాస్టల్‌లో కరోనా కలకలం రేపింది. సుమారు 15 మంది అమ్మాయిలు కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. విషయం తెలియగానే అధికారులు వెంటనే హాస్టల్‌కు పరుగులు పెట్టారు. ఒక్కొక్కరికీ విడిగా కరోనా పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ సెంటర్లకు తరలించి […]

Update: 2021-08-03 03:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. తాజాగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జవహార్ లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ (JNTU) అమ్మాయిల హాస్టల్‌లో కరోనా కలకలం రేపింది.

సుమారు 15 మంది అమ్మాయిలు కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. విషయం తెలియగానే అధికారులు వెంటనే హాస్టల్‌కు పరుగులు పెట్టారు. ఒక్కొక్కరికీ విడిగా కరోనా పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ సెంటర్లకు తరలించి వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News