కృష్ణమూర్తి పాత్ర మరువలేనిది
దిశ, సూర్యాపేట: తెలంగాణ సాయుధ పోరాట యోధులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కాచం కృష్ణ మూర్తి ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. శనివారం స్థానిక మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్ లో కాచం కృష్ణమూర్తి 14వ వర్ధంతిని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి వీర తెలంగాణ విప్లవ […]
దిశ, సూర్యాపేట: తెలంగాణ సాయుధ పోరాట యోధులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కాచం కృష్ణ మూర్తి ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. శనివారం స్థానిక మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్ లో కాచం కృష్ణమూర్తి 14వ వర్ధంతిని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి వీర తెలంగాణ విప్లవ పోరాటంలో కృష్ణమూర్తి పాత్ర మరువలేనిదన్నారు.
జనగామ, ఇబ్రహీంపట్నం, రాచకొండ ప్రాంతాలలో పేదలకు భూములు పంచాలని, కూలీ ధర పెంచాలని, వెట్టిచాకిరి రద్దు చేయాలని అనేక ఉద్యమాలు నిర్వహించారనన్నారు. తెలంగాణ ప్రాంతంలో జరిగిన వీర తెలంగాణ విప్లవ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని దొరలకు, జాగీర్దార్లకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారన్నారు.
బ్రతికున్నంత కాలం నీతిగా, నిజాయితీగా జీవితాన్ని గడిపి, ఎంతోమంది కార్యకర్తలకు ఆదర్శప్రాయుడు అయ్యాడని, వారు చూపించిన పోరుబాటలో పనిచేయాలన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సభలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు పాల్గొన్నారు.