పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం

లాహోర్: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్ ప్రావిన్సులోని అట్టోక్ జిల్లా హసన్ అబ్దల్ ఏరియా బుర్హాన్ ఇంటర్ ఛేంజ్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న 13 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. బస్సు ఖైబర్ ఫక్తూన్ ఖవా నుంచి లాహోర్ నగరానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మరో 25 మంది గాయపడ్డట్టు సమాచారం. గమనించిన స్థానికులు వారిని వెంటనే […]

Update: 2021-05-03 20:39 GMT

లాహోర్: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్ ప్రావిన్సులోని అట్టోక్ జిల్లా హసన్ అబ్దల్ ఏరియా బుర్హాన్ ఇంటర్ ఛేంజ్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న 13 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. బస్సు ఖైబర్ ఫక్తూన్ ఖవా నుంచి లాహోర్ నగరానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మరో 25 మంది గాయపడ్డట్టు సమాచారం. గమనించిన స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఒక మహిళ, చిన్నారి కూడా ఉన్నారు.

Tags:    

Similar News