Nipah virus: కేరళలో మరోసారి ‘నిఫా’ వైరస్ కలకలం.. 12 ఏళ్ల బాలుడి మృతి

దిశ, వెబ్‌డెస్క్ : కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న వేళ మరోసారి అక్కడ నిఫా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. తాజాగా ఓ 12 ఏళ్ల బాలుడు నిఫా బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్‌లో శనివారం సాయంత్రం వెలుగుచూసింది. నిఫా కలకలంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. కేరళకు వెంటనే ఎన్‌సీడీసీ బ‌ృందాన్ని కేంద్రం పంపించింది. నిఫాతో బాలుడు మృతి చెందినట్టు కేరళ ఆరోగ్యమంత్రి అధికారికంగా […]

Update: 2021-09-04 22:31 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న వేళ మరోసారి అక్కడ నిఫా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. తాజాగా ఓ 12 ఏళ్ల బాలుడు నిఫా బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్‌లో శనివారం సాయంత్రం వెలుగుచూసింది. నిఫా కలకలంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. కేరళకు వెంటనే ఎన్‌సీడీసీ బ‌ృందాన్ని కేంద్రం పంపించింది. నిఫాతో బాలుడు మృతి చెందినట్టు కేరళ ఆరోగ్యమంత్రి అధికారికంగా ప్రకటించారు. అయితే, బాలుడి కుటుంబసభ్యుల్లో ఎవరికీ నిఫా లక్షణాలు లేవని మంత్రి వీణాజార్జి స్పష్టంచేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. కాంటాక్ట్, ట్రేసింగ్ వంటి ఇతర చర్యలను ఇప్పటికే ప్రారంభించినట్టు తెలిపారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వెల్లడించారు.

Tags:    

Similar News