ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం..12 మంది రోగులు సజీవ దహనం
దిశ, వెబ్‌డెస్క్ : గుజరాత్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భరూచ్ నగరంలోని వెల్ఫేర్ ఆసుపత్రిలో ఉదయం ఒంటి గంట సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది కరోనా రోగులు సజీవ దహనమయ్యారు. నాలుగు అంతస్తులున్న ఈ ఆసుపత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఆసుపత్రిలో మొత్తం 50 మంది రోగులు చికిత్స పొందుతుండగా, వారిలో 24 మంది ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన రోగులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం […]
దిశ, వెబ్‌డెస్క్ : గుజరాత్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భరూచ్ నగరంలోని వెల్ఫేర్ ఆసుపత్రిలో ఉదయం ఒంటి గంట సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది కరోనా రోగులు సజీవ దహనమయ్యారు. నాలుగు అంతస్తులున్న ఈ ఆసుపత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఆసుపత్రిలో మొత్తం 50 మంది రోగులు చికిత్స పొందుతుండగా, వారిలో 24 మంది ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు.
ప్రమాదం నుంచి బయటపడిన రోగులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.