వీడిన 12 రోజుల చిన్నారి డెత్ మిస్టరీ

దిశ, వెబ్‌డెస్క్ : ఏలూరు సాయి చిల్డ్రన్స్ ఆస్పత్రి నీళ్ల ట్యాంకులో శవమై తేలిన చిన్నారి మృతి కేసులో చిక్కుముడి వీడింది. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న 12 రోజుల పసికందు ఆరోగ్యం కుదుటపడ్డాక శవంగా తేలింది. ఆస్పత్రి బెడ్‌పై ఉండాల్సిన చిన్నారి నీళ్ల ట్యాంకులో విగతజీవిగా కలిపించింది. అయితే పాప ఎలా చనిపోయిందనేది మిస్టరీగా మారింది. ఆస్పత్రి యజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసి అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేశారు. 24 గంటల్లోనే కేసును […]

Update: 2021-08-12 06:40 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏలూరు సాయి చిల్డ్రన్స్ ఆస్పత్రి నీళ్ల ట్యాంకులో శవమై తేలిన చిన్నారి మృతి కేసులో చిక్కుముడి వీడింది. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న 12 రోజుల పసికందు ఆరోగ్యం కుదుటపడ్డాక శవంగా తేలింది. ఆస్పత్రి బెడ్‌పై ఉండాల్సిన చిన్నారి నీళ్ల ట్యాంకులో విగతజీవిగా కలిపించింది. అయితే పాప ఎలా చనిపోయిందనేది మిస్టరీగా మారింది. ఆస్పత్రి యజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసి అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేశారు. 24 గంటల్లోనే కేసును ఓ కొలిక్కి తెచ్చి నిందితులను తేల్చారు.

కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని రేమెల్లెకు చెందిన హరికృష్ణ, సీతామహాలక్ష్మి దంపతులకు 12రోజుల క్రితం పాప పుట్టింది. శిశువు అనారోగ్యంగా ఉండటం, పాలు తాగకపోవడంతో రెండురోజుల క్రితం ఏలూరులోని సాయి ప్రైవేటు చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య చికిత్స అనంతరం కోలుకున్న చిన్నారిని నిన్న డిచార్జి చేయాల్సి ఉంది. కానీ పాప మధ్యాహ్నం సమయంలో కనిపించకుండా పోయింది. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అటు ఆస్పత్రి యజమాన్యం, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా చిన్నారి ఆస్పత్రి వెనక ఉన్న వాటర్ ట్యాంకులో శవమై కనిపించింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆస్పత్రి ఆవరణ, సీసీ కెమెరాలను పరిశీలించారు. అనుమానితులను ప్రశ్నించారు. చివరికి చిన్నారి తల్లిదండ్రులను సైతం అదుపులోకి తీసుకుని విచారించారు. తల్లి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆమెను అనుమానించిన పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి గట్టిగా నిలదీశారు. దీంతో ఈ కేసులో దాగిన చిక్కుముడిని విప్పింది. పుట్టిన వెంటనే అనారోగ్యానికి గురైన చిన్నారి ఆరోగ్యం భవిష్యత్తులో ఎలా ఉంటుందోనని భయంతో నీళ్ల ట్యాంకులో పడేసినట్లు ఒప్పుకుంది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News