11వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు ఊరట

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: దుబ్బాక ఫలితాలు క్రమంగా బీజేపీ వైపునకు మళ్లుతున్నాయి. 11 రౌండ్లలో బీజేపీ ఎనిమిది, టీఆర్ఎస్ మూడు రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యం చూపించాయి. టీఆర్ఎస్ 6,7,10వ రౌండ్లలో ఆధిక్యం సాధించగా.. బీజేపీ 1,2,3,4,5,8,9,11 రౌండ్లలో పైచేయి సాధించింది. రౌండ్ రౌండ్ కు ఫలితాలు దోబూచులాడుతుండడంతో ఆయా పార్టీల శ్రేణులు ఊపిరి సలపని ఉత్కంఠతో తుది ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు 11 రౌండ్లు కౌంటింగ్ కాగా, మరో 12 రౌండ్లు కౌంటింగ్ […]

Update: 2020-11-10 02:34 GMT

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: దుబ్బాక ఫలితాలు క్రమంగా బీజేపీ వైపునకు మళ్లుతున్నాయి. 11 రౌండ్లలో బీజేపీ ఎనిమిది, టీఆర్ఎస్ మూడు రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యం చూపించాయి. టీఆర్ఎస్ 6,7,10వ రౌండ్లలో ఆధిక్యం సాధించగా.. బీజేపీ 1,2,3,4,5,8,9,11 రౌండ్లలో పైచేయి సాధించింది. రౌండ్ రౌండ్ కు ఫలితాలు దోబూచులాడుతుండడంతో ఆయా పార్టీల శ్రేణులు ఊపిరి సలపని ఉత్కంఠతో తుది ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు 11 రౌండ్లు కౌంటింగ్ కాగా, మరో 12 రౌండ్లు కౌంటింగ్ కావల్సి ఉంది. 11వ రౌండ్ లో మాత్రమే కాంగ్రెస్ కు అత్యధికంగా 1883 వచ్చాయి. దీంతో మొత్తం కాంగ్రెస్ ఇప్పటివరకు 8582 ఓట్లు పొందింది.

కాగా 11వ రౌండ్‌లో బీజేపీకి 34,748, టీఆర్ఎస్‌కు 30,815, కాంగ్రెస్‌కు 8582 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి 3933 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 82,503 ఓట్లను లెక్కించారు. నోటాకు 318 ఓట్లు పడ్డాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో మొత్తం 1453 పోస్టల్ బ్యాలట్ ఓట్లు పోల్ కాగా, ఇందులో 72 ఇన్ వ్యాలిడ్ అయ్యాయి. 1381 ఓట్లు పనికొచ్చాయి. వీటిలో టీఆర్ఎస్ – 720, బీజేపీ – 368, కాంగ్రెస్ – 142, కత్తి కార్తీక – 15 ఓట్లు పోలయ్యాయి.

Tags:    

Similar News