తండ్రి మందలించాడని… టెన్త్ విద్యార్థి బలవన్మరణం
దిశ, ఖమ్మం రూరల్: కన్న తల్లిదండ్రులు మందలించారనే మనస్థాపంతో ఓ టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రూరల్ మండలం పెద్దతండా టెంపుల్ సిటీలో నివాసం ఉంటున్న చల్లా రాంబాబుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు బానుప్రకాష్ ఖమ్మం నగరంలోని హర్వెస్ట్ స్కూల్లో టెన్త్ చదువుతున్నాడు. ఈ నెల 14న పుట్టిరోజు వేడుకలను తన స్నేహితులతో నిర్వహించుకున్నాడు. విషయాన్ని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు తెలియజేశారు. బానుప్రకాష్ను తల్లిదండ్రులు మందలించడంతో మరుసటి రోజైన 15న ఇంట్లో […]
దిశ, ఖమ్మం రూరల్: కన్న తల్లిదండ్రులు మందలించారనే మనస్థాపంతో ఓ టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రూరల్ మండలం పెద్దతండా టెంపుల్ సిటీలో నివాసం ఉంటున్న చల్లా రాంబాబుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు బానుప్రకాష్ ఖమ్మం నగరంలోని హర్వెస్ట్ స్కూల్లో టెన్త్ చదువుతున్నాడు. ఈ నెల 14న పుట్టిరోజు వేడుకలను తన స్నేహితులతో నిర్వహించుకున్నాడు. విషయాన్ని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు తెలియజేశారు. బానుప్రకాష్ను తల్లిదండ్రులు మందలించడంతో మరుసటి రోజైన 15న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తండ్రి రాంబాబు వెంటనే చికిత్స నిమిత్తం హస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. శవాన్ని పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జక్కుల శంకర్రావు తెలిపారు.