108 సిబ్బంది సాహసం.. తల్లి,బిడ్డ క్షేమం

దిశ, విశాఖపట్నం : 108 అంబులెన్స్ సిబ్బంది సాహసంతో ఆపదలో ఉన్న రెండు ప్రాణాలు నిలిచాయి. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం విజయారాంపురం గ్రామానికి చెందిన నిమ్మక జయలక్ష్మికి నిండు గర్భిణి. ఆమెకు మంగళవారం పురుటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు. పాలకొండ నుంచి బయలుదేరిన 108.. అర కిలోమీటర్ వరకు రివర్స్ లో వచ్చింది. పాలకొండ రోడ్డు ఇరుకుగా, పూర్తిగా గుంతలమయంగా ఉండడంతో అంబులెన్స్ మలపడానికి ఇబ్బంది కాకుండా రివర్స్ లో […]

Update: 2020-12-01 11:54 GMT

దిశ, విశాఖపట్నం : 108 అంబులెన్స్ సిబ్బంది సాహసంతో ఆపదలో ఉన్న రెండు ప్రాణాలు నిలిచాయి. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం విజయారాంపురం గ్రామానికి చెందిన నిమ్మక జయలక్ష్మికి నిండు గర్భిణి. ఆమెకు మంగళవారం పురుటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు. పాలకొండ నుంచి బయలుదేరిన 108.. అర కిలోమీటర్ వరకు రివర్స్ లో వచ్చింది. పాలకొండ రోడ్డు ఇరుకుగా, పూర్తిగా గుంతలమయంగా ఉండడంతో అంబులెన్స్ మలపడానికి ఇబ్బంది కాకుండా రివర్స్ లో వచ్చింది. మధ్యలో పెద్ద వాగు ఉండడంతో 108 అక్కడే ఆగిపోయింది. వాగు అవతల ఉన్న గర్భిణిని తీసుకురావడానికి 108 సిబ్బంది శ్రీనివాస్, పైలెట్ చంద్రం స్ట్రక్చర్ తో వెళ్లి ఆమెను వాగును దాటించారు. అక్కడ నుంచి పాలకొండ ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది చూపిన చొరవతో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. వారిని గర్భిణీ బంధువులు, స్థానికులు అభినందించారు.

 

Tags:    

Similar News