హాస్పిటల్స్‌పై 1039 ఫిర్యాదులు
దిశ, వెబ్ డెస్క్: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని ఆస్పత్రులు, వాటి పనితీరుపై ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ప్రయివేటు ఆస్పత్రుల్లో ప్రభుత్వం కరోనా చికిత్సకు అనుమతించినప్పటి నుంచి ఫిర్యాదులు మరింత పెరిగాయి. వీటికి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్రంలో 1039 ఫిర్యాదు అందాయి. ఈ విషయాన్ని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు శనివారం వెల్లడించారు. ప్రధానంగా అందులో 136 ఫిర్యాదులు.. ఆస్పత్రులు వేసిన బిల్లులకు సంబంధించినవని ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులన్నింటినీ పరిశీలించిన అనంతరం.. వాటి […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని ఆస్పత్రులు, వాటి పనితీరుపై ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ప్రయివేటు ఆస్పత్రుల్లో ప్రభుత్వం కరోనా చికిత్సకు అనుమతించినప్పటి నుంచి ఫిర్యాదులు మరింత పెరిగాయి. వీటికి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్రంలో 1039 ఫిర్యాదు అందాయి. ఈ విషయాన్ని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు శనివారం వెల్లడించారు.
ప్రధానంగా అందులో 136 ఫిర్యాదులు.. ఆస్పత్రులు వేసిన బిల్లులకు సంబంధించినవని ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులన్నింటినీ పరిశీలించిన అనంతరం.. వాటి పరిష్కారానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.