సెంచరీ బామ్మ గోవిందు అర్లమ్మ మృతి..
దిశ, తుంగతుర్తి: అత్యధిక సంవత్సరాలు జీవించిన బామ్మ, సంఘసేవ కర్త గోవిందు అర్లమ్మ (102) గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా అడ్డగూడూర్ మండలం ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. ఆమె పార్ధీవ దేహానికి తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గోవిందు అర్లమ్మ చేసిన సంఘసేవ కార్యక్రమాలు మరువలేనివి అని అన్నారు. ఆయన వెంట సర్పంచ్ శీల జ్యోతి రాములు, […]
దిశ, తుంగతుర్తి:
అత్యధిక సంవత్సరాలు జీవించిన బామ్మ, సంఘసేవ కర్త గోవిందు అర్లమ్మ (102) గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా అడ్డగూడూర్ మండలం ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. ఆమె పార్ధీవ దేహానికి తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గోవిందు అర్లమ్మ చేసిన సంఘసేవ కార్యక్రమాలు మరువలేనివి అని అన్నారు. ఆయన వెంట సర్పంచ్ శీల జ్యోతి రాములు, మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మీడి ప్రభాకర్ రెడ్డి, అడ్డగూడురు సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూలపెళ్ళి జనార్ధన్ రెడ్డి, సీహెచ్ మధు తదితరులు పాల్గొన్నారు.