కరోనాను జయించిన వందేళ్ల వృద్ధురాలు

దిశ ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా వైరస్ సోకితే ఇక వారు కోలుకోవడం కష్టమనే అభిప్రాయం బలంగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్‎గా నిర్ధారణ అయిన శతాధిక వృద్ధురాలు కరోనాను జయించిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి చెందిన పాలకూరు మంగమ్మ (101) కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెకు […]

Update: 2020-07-25 09:26 GMT

దిశ ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా వైరస్ సోకితే ఇక వారు కోలుకోవడం కష్టమనే అభిప్రాయం బలంగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్‎గా నిర్ధారణ అయిన శతాధిక వృద్ధురాలు కరోనాను జయించిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి చెందిన పాలకూరు మంగమ్మ (101) కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెకు తిరుపతిలోని కొవిడ్-19 సెంటర్ స్విమ్స్ పద్మావతి స్టేట్ కొవిడ్ సెంటర్ లోని ఐసోలేషన్ వార్డులో జాయిన్ చేశారు. అప్పటి నుంచి ఆమెకు వైద్యసిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందించారు. దీంతో ఆమె కరోనా నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో కరోనా సోకితే చనిపోతారన్న ప్రచారం తప్పని నిరూపించిన ఆమెకు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు.

Tags:    

Similar News