100క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
దిశ, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని మిర్చి కంపౌండ్‌లో 100క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శనివారం నిజామాబాద్ నగరంలోని ఒకటో టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎంహెచ్ 12 హెచ్ డీ 2179 డీసీఎం వాహనంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా బియ్యం రవాణా అవుతున్నదని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు సీఐ నరేందర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. డీసీఎం వాహనంలోని పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు సివిల్ సప్లై […]
దిశ, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని మిర్చి కంపౌండ్‌లో 100క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శనివారం నిజామాబాద్ నగరంలోని ఒకటో టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎంహెచ్ 12 హెచ్ డీ 2179 డీసీఎం వాహనంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా బియ్యం రవాణా అవుతున్నదని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు సీఐ నరేందర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. డీసీఎం వాహనంలోని పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. ఈ మేరకు స్థానిక 1వ టౌన్ పోలీస్‌స్టేషన్ లో డీసీఎం ఓనర్ సమీర్‌పై కేసు నమోదు చేశారు.
Tags: carona, lockdown 100quitanl rice handover, nizamabad,taskforce