100 కోట్ల మందిపై కరోనా ప్రభావం : ఐరాస

దిశ, వెబ్‌డెస్క్: గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యావ్యవస్థపై కరోనా ప్రతికూల ప్రభావం చూపిందని ఐక్యారాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అన్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా.. 160 దేశాల్లోని 100 కోట్ల మందికిపైగా విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగిందన్నారు. అంతే కాకుండా.. దాదాపు నాలుగు కోట్ల మంది చిన్నారులు అత్యంత కీలకమైన ప్రాథమిక విద్యకు దూరమయ్యారని వివరించారు. దీంతో ఓ తరం మొత్తం విద్యా విపత్తు కింద నలిగిపోయే పరిస్థితిని ప్రపంచం ఎదుర్కుంటోందని […]

Update: 2020-08-04 08:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యావ్యవస్థపై కరోనా ప్రతికూల ప్రభావం చూపిందని ఐక్యారాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అన్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా.. 160 దేశాల్లోని 100 కోట్ల మందికిపైగా విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగిందన్నారు. అంతే కాకుండా.. దాదాపు నాలుగు కోట్ల మంది చిన్నారులు అత్యంత కీలకమైన ప్రాథమిక విద్యకు దూరమయ్యారని వివరించారు.

దీంతో ఓ తరం మొత్తం విద్యా విపత్తు కింద నలిగిపోయే పరిస్థితిని ప్రపంచం ఎదుర్కుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. దాశాబ్దాలుగా సాధించిన అభివృద్ధి అంతా దీని వల్ల తుడిచిపెట్టుకుపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఉన్న అసమానతలు మరింత పెరిగిపోవచ్చునని ఆయన హెచ్చరించారు. కరోనాకు ముందు కూడా ప్రపంచం.. శిక్షణా సంక్షోభాన్ని ఎదుర్కొందని, దాదాపు 25 కోట్ల మంది చిన్నారులు చదువుకు దూరమయ్యారన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కేవలం పావు శాతం మంది విద్యార్థుల మాత్రమే కనీస నైపుణ్యాలతో పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు.

Tags:    

Similar News