దుబ్బాకలో త్వరలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభం : MLA రఘునందన్

దిశ, దుబ్బాక : దుబ్బాక పట్టణంలో నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని డిసెంబర్ నెల చివరి వారంలో ప్రారంభం చేయనున్నట్లు ఎమ్మెల్యే రఘునందన్ రావు వెల్లడించారు. శుక్రవారం వైద్య సిబ్బందితో కలిసి వంద పడకల ఆసుపత్రి చివరి దశలో ఉన్న నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడం సంతోషకరం అన్నారు. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య […]

Update: 2021-12-17 02:23 GMT

దిశ, దుబ్బాక : దుబ్బాక పట్టణంలో నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని డిసెంబర్ నెల చివరి వారంలో ప్రారంభం చేయనున్నట్లు ఎమ్మెల్యే రఘునందన్ రావు వెల్లడించారు. శుక్రవారం వైద్య సిబ్బందితో కలిసి వంద పడకల ఆసుపత్రి చివరి దశలో ఉన్న నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడం సంతోషకరం అన్నారు.

24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఈ వంద పడకల ఆసుపత్రి ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో గతంలో ఒక కోటి ఇరవై లక్షలు సీసీ రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయడమే కాకుండా ఇప్పుడు మరో కోటి 70 లక్షలు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎవరెన్ని ఇబ్బందులు పెట్టిన అన్నింటిని దాటి ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని హంగులతో కూడిన వంద పడకల ఆసుపత్రి పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ఈ నెల చివరి వారంలో ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఈ వంద పడకల ఆసుపత్రి ప్రారంభం జరుపుకోబోతున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు జ్యోతి, కౌన్సిలర్ మల్లారెడ్డి, బీజేపీ నాయకులు బాలేష్ గౌడ్, సుంకు ప్రవీణ్, సంపంగి అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News