బాన్సువాడలో 10 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు: పోచారం

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలోనే ఒక్క బాన్సువాడ నియోజకవర్గానికి 10 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేశారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని నసరుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంపు, అంకోల్ గ్రామం, అంకోల్ తండాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా అంకోల్ క్యాంప్ వద్ద మెయిన్ రోడ్డు నుంచి హాజీపూర్ గ్రామం మధ్య ఉన్న ప్రస్తుత రోడ్డును.. రూ. 6 కోట్లతో డబుల్ రోడ్డుగా […]

Update: 2021-09-16 09:57 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలోనే ఒక్క బాన్సువాడ నియోజకవర్గానికి 10 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేశారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని నసరుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంపు, అంకోల్ గ్రామం, అంకోల్ తండాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఇందులో భాగంగా అంకోల్ క్యాంప్ వద్ద మెయిన్ రోడ్డు నుంచి హాజీపూర్ గ్రామం మధ్య ఉన్న ప్రస్తుత రోడ్డును.. రూ. 6 కోట్లతో డబుల్ రోడ్డుగా నిర్మించే పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, అంకోల్ గ్రామంలో రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించిన కురుమ సంఘం భవనం, మత్స్య సంఘం భవనాలను ప్రారంభించారు. అంకోల్ తండాలో నూతనంగా నిర్మించిన 30 డబుల్ బెడ్ రూం ఇళ్ళను ప్రారంభించి.. మరో 15 ఇళ్ళకు భూమి పూజ చేశారు. స్థానిక పాఠశాలతో రూ. 18 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు కూడా శంకుస్థాపన చేశారు. గ్రామ పంచాయతీ నూతన భవనం నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరు చేశారు.

ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలలో స్పీకర్ మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడడానికే డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తున్నామన్నారు. అన్ని వసతులతో, 100 శాతం సబ్సిడీపై దేశంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గానికి మాత్రమే పదివేల ఇండ్లు మంజూరు అయ్యాయని స్పష్టం చేశారు. మరో 5 వేల ఇళ్ళను తెచ్చి మిగిలిన పేదలందరికీ మంజూరు చేస్తాను.. భవిష్యత్తులో నియోజకవర్గ పరిధిలో మాకు సొంత ఇల్లు లేదు అనేవారు ఉండకూడదు అన్నదే తన ఆశయం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News