టీఎస్ ఎంసెట్‌కు 1.61 లక్షల దరఖాస్తులు

దిశ, మేడ్చల్: కూకట్‌పల్లిలోని జవహార్‌లాల్ నెహ్రూ సాంకేతిక యూనివర్సిటీ నిర్వహిస్తున్న టీఎస్ ఎంసెట్-2020కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ రోజు (28వ తేదీ) సాయంత్రం వరకు 1,61,478 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగానికి 1,04,281 మంది, అగ్రికల్చర్ తదితర కోర్సుల కోసం 57,197 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్ ఎంసెట్‌ దరఖాస్తు గడువు ఈ నెల 30తో ముగియాల్సి ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్ 7 వరకు దరఖాస్తు గడువును పొడిగించారు. దీంతో […]

Update: 2020-03-28 10:53 GMT

దిశ, మేడ్చల్: కూకట్‌పల్లిలోని జవహార్‌లాల్ నెహ్రూ సాంకేతిక యూనివర్సిటీ నిర్వహిస్తున్న టీఎస్ ఎంసెట్-2020కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ రోజు (28వ తేదీ) సాయంత్రం వరకు 1,61,478 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగానికి 1,04,281 మంది, అగ్రికల్చర్ తదితర కోర్సుల కోసం 57,197 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్ ఎంసెట్‌ దరఖాస్తు గడువు ఈ నెల 30తో ముగియాల్సి ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్ 7 వరకు దరఖాస్తు గడువును పొడిగించారు. దీంతో దరఖాస్తుదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News