- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖకు మరో అతి పెద్ద ప్రమాదం ఉందా??
దిశ, వెబ్ డెస్క్: విశాఖ వాసులను ఇప్పుడు అతిపెద్ద భయం వెంటాడుతోంది. లెబనాన్ రాజధాని బీరుట్ లో జరిగిన పేలుడు ఘటన ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. అమ్మోనియం నైట్రేట్ నిల్వల వలన ఈ పేలుడు సంభవించింది. విశాఖలో కూడా భారీగా నైట్రేట్ నిలువలు ఉన్న కారణంగా ప్రమాదం పొంచి ఉందని నిపుణులు, అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ అంశంపై స్పందించిన మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఆందోళన వ్యక్తం చేసారు.విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో 2 లక్షల 69 వేల 505 టన్నుల అమ్మోనియం నైట్రేట్ దిగుమతులు, నిల్వలు ఉన్నాయన్నారు. వీటి ప్రక్రియలను అత్యంత కఠినతరం చేయాలని ఆయన కోరారు.
లెబనాన్ రాజధానిలో కేవలం 2,750 టన్నుల నిల్వ మాత్రమే ఉందన్నారు. విశాఖలో సగటున 30 వేల టన్నుల నిల్వ ఉంటుందన్నారు. వీటిని విశాఖలో 6 ప్రదేశాల్లో నిల్వ ఉంచుతారని తెలిపారు.
స్థానిక అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఆదేశించాలని విజ్ఞప్తి చేసారు. ఏదైనా పొరపాటు జరిగితే హెచ్ పి సి ఎల్ కి ప్రమాదం తప్పదని హెచ్చరించారు.