- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాస్క్‌కు హిందీలో అర్థం చెప్పిన బిగ్‌బీ
కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫ్రంట్‌లైన్ వారియర్స్ నుంచి సెలబ్రిటీల వరకు, కామన్ మ్యాన్ నుంచి పొలిటికల్ లీడర్ల వరకు కొవిడ్ వైరస్ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇలాంటి సమయంలో అందరి దగ్గర ఉన్న ఆయుధాలు.. మాస్క్, సోషల్ డిస్టెన్స్ మాత్రమే. అయితే ఇప్పటికే వైద్యులు, పరిశోధకులు, ప్రభుత్వాలు మాస్క్ ప్రాధాన్యం గుర్తించి తప్పకుండా ధరించాలని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ మాస్క్‌ను హిందీలో ఏమంటారో తెలుపుతూ తాజాగా ఓ పోస్టు షేర్ చేశారు. అది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కరోనా లాక్‌డౌన్ కారణంగా, థియేటర్లు తెరుచుకోకపోవడంతో.. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన ‘గులాబో సితాబో’ చిత్రం జూన్ 12న ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. బిగ్ బీ నటనకు విమర్శకుల ప్రశంసలు రావడంతో పాటు సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రానికి చెందిన మాస్క్‌ను పెట్టుకుని ఉన్న ఓ ఫోటోను అమితాబ్ తాజాగా పోస్ట్ చేశారు. దానికి జతగా.. ‘నాసికాముఖసంరక్షక కీటానురోధక వాయుఛానక వస్త్రడోరీయుక్తపట్టీ’ అని వివరిస్తూ మాస్క్‌కు కొత్త అర్థం కూడా చెప్పారు.
https://www.instagram.com/p/CByb82HBOko/?utm_source=ig_embed