గాడ్ బ్లెస్ యూ తల్లి : బిగ్ బీ

by Anukaran |   ( Updated:2023-03-24 17:47:03.0  )
గాడ్ బ్లెస్ యూ తల్లి : బిగ్ బీ
X

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇండియన్ సినిమాకు అడ్రస్ లాంటివారు. అలాంటి గొప్ప వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో అభిమానులు చాలా ఆందోళన చెందారు. ప్రస్తుతం ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన.. క్షేమంగా ఉన్నాడన్న వైద్యుల ప్రకటనతో కాస్త కుదుటపడ్డారు ఫ్యాన్స్.

కాగా, జులై 11 నుంచి బిగ్ బీ ఆస్పత్రిలోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే, శనివారం తను చూసిన ఒక వీడియో.. ఆస్పత్రిలో ఉన్న రోజుల్లో మునుపెన్నడూ లేని సంతోషాన్నిచ్చిందని తెలిపారు. తన స్నేహితుడు, మ్యూజిక్ పార్టనర్ ఒకరు తనకు సెండ్ చేసిన వీడియో గురించి తెలిపిన ఆయన.. వీడియోలో అమ్మాయి ప్రతిభను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. కర్నాటక్, వెస్ట్రన్ పాప్ కలపడం అంత తేలికైన పని కాదని.. కానీ తన యుక్తి, ప్రతిభతో ఆ రెండింటినీ కలిపి సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని కొనియాడారు. ఈ ప్రతిభను రాజీ లేకుండా ఇలాగే కొనసాగించాలని.. దేవుడి ఆశీర్వాదంతో ఏదో ఒక రోజు గొప్ప స్థాయికి చేరుకుంటావని సూచించారు.

Advertisement

Next Story