- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేరా సర్కార్ కా ‘కరోనా వైరస్’
కరోనా.. దాదాపు మూడు నెలలుగా ఈ పదం విని విని విసుగొస్తోంది. కానీ, కాంటెంపరరీ అంశాలపై సినిమాలు తీసే రాంగోపాల్ వర్మకు మాత్రం అలా అనిపించలేదు. అయినా, అందరిలా ఆలోచిస్తే ఆయన రాము ఎందుకవుతాడు ? అందుకే ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఈ వైరస్‌పై తొలిసారి సినిమా తీసి రికార్డు సృష్టించాడు. ‘మన పనిని ఎవరూ ఆపలేరు.. అది దేవుడే కానీ కరోనానే కానీ..’ అని రుజువు చేసేందుకే లాక్‌డౌన్ పీరియడ్‌లో “కరోనా వైరస్” సినిమా తీసామన్న వర్మ.. ఈ చిత్రం మనలో ఉన్న భయాలను బయట పెడుతుందన్నారు. ‘వ్యాధి వల్ల కలిగే భయం గొప్పదా లేక ప్రేమకున్న శక్తి గొప్పదా అని పరీక్షిస్తుందన్నారు. కరోనా వైరస్ సినిమా హారర్ ఫిల్మ్ కాదు, మనలో ఉన్న హారర్స్ గురించి తీసిన సినిమా’ అన్నారు. ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో దూసుకుపోతుండగా.. వర్మ పనితనం గురించి ప్రశంసలు కురిపించారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.
14 lakh views in 14 hours and TRENDING at No. 1 ..GO CORONA GO #CORONAVIRUSFILM https://t.co/fun1Ed36Sn pic.twitter.com/DzkTlXLCmN
— Ram Gopal Varma (@RGVzoomin) May 27, 2020
‘ఎందరు తొక్కాలనుకున్నా అణచివేయలేని రామ్ గోపాల్ వర్మ.. మీ అందరికీ రాము.. నాకు సర్కార్’ అంటూ పోస్ట్ పెట్టారు బిగ్‌బీ. ‘లాక్‌డౌన్‌లో ఒక కుటుంబం ఎదుర్కొనే పరిస్థితుల గురించి లాక్‌డౌన్ సమయంలోనే సినిమా తీశాడు. “కరోనా వైరస్” టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా.. బహుశా వైరస్‌పై నిర్మించిన మొదటి చిత్రం కావచ్చు’ అంటూ ట్రైలర్ లింక్ షేర్ చేసి వర్మకు ఆల్ ది బెస్ట్ చెప్పారు బచ్చన్ జీ.
THANKS SARKAAAAR! ..I couldn’t just let a chungoo mungoo VIRUS to LOCK me DOWN https://t.co/5ru98HO4eE
— Ram Gopal Varma (@RGVzoomin) May 27, 2020
దీనిపై స్పందించిన ఆర్జీవీ.. ‘థ్యాంక్స్ సర్కార్ జీ’ అంటూ ధన్యవాదాలు తెలిపారు. నన్ను లాక్ చేయడానికి చుంగుముంగు వైరస్‌ను అనుమతించలేనని, అంతేకాదు లాక్‌డౌన్ నిబంధనలు అనుసరించే సినిమా తీశానని.. ఈశ్వర్, అల్లా, జీసస్‌తో పాటు ప్రభుత్వం మీద కూడా ఒట్టేశాడు వర్మ.