- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ న్యూస్ : రంగంలోకి దిగిన అమిత్ షా.. కేసీఆర్‌కు మాస్టర్ స్ట్రోక్ తప్పదా..?
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎప్పుడైనా ముందస్తుకు వెళ్లొచ్చని, నేతలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బీజేపీ రాష్ట్ర నేతలకు సూచించారు. పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలో బుధవారం బీజేపీ రాష్ట్ర నేతలంతా అమిత్‌షాతో భేటీ అయ్యారు. నేతలంతా వారి వారి నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజా సమస్యలపై ఫోకస్పెట్టాలని, టీఆర్ఎస్వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. కేసీఆర్ ముందస్తుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తున్నదని, ఈ మేరకు సంకేతాలిస్తున్నారని పేర్కొన్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు.
దాదాపు 40కి పైగా స్థానాల్లో సిట్టింగులను మార్చే యోచనలో కేసీఆర్ ఉన్నారని చెప్పారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తొలగించేందుకు ఈ ఫార్ములాను ఎంచుకునే చాన్స్ ఉన్నదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఏడేళ్లుగా హామీలిస్తూ నెరవేర్చని పథకాలపై ప్రశ్నించాలని, వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. టీఆర్ఎస్దూకుడుకు కళ్లెం వేయాలని సూచించారు. అదే స్థాయిలో బీజీపీ నేతలు దూకుడును పెంచాలన్నారు. కేసీఆర్ అవినీతిని ఆధారాలతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని చెప్పారు. వడ్ల కొనుగోలు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కేంద్రాన్ని దోషిగా నిలిపేందుకు టీఆర్ఎస్ప్రయత్నిస్తున్నదని, గ్రామస్థాయికి అసలు విషయాలు చేరేలా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు.
వడ్ల కొనుగోళ్ల విషయంలో రికార్డుల్లోని అక్రమాలను వెలికితీయాలని, రైస్‌మిల్లర్లకు లాభం చేకూర్చాలని పెద్ద కుంభకోణాన్ని కేసీఆర్ ప్రభుత్వం చేసిందని, వాటిని ప్రజలకు వివరించాలని చెప్పారు. కేడర్మొత్తం ఇప్పటి నుంచే అలర్ట్ కావాలన్నారు. అలా చేస్తేనే తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణంతోపాటు రాష్ట్రంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని బయట పెట్టాలని రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా సూచించారు. బీజేపీ నేతల పర్యటనల సందర్భంగా టీఆర్ఎస్ నేతలు చేసే దాడులు.. పోలీసులు చేసే ఓవరాక్షన్ చూసి బెదిరిపోవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని, ఎలాంటి భేషజాలు లేకుండా నేతలంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు.
బండితో ప్రత్యేక భేటీ..
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌తో దాదాపు 10 నిమిషాలకు పైగా ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వంపై ఫైట్చేయాలని సూచించినట్లు సమాచారం. పాదయాత్ర విషయమై చర్చ జరిగినట్టు తెలిసింది. మొదటి విడత పాదయాత్ర సక్సెస్ ఫుల్‌గా పూర్తిచేసిన బండిని అమిత్‌షా అభినందించినట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. సెకండ్ ఫేజ్ యాత్ర చేపట్టాలని సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చాక రెండో విడత పాదయాత్ర ఏర్పాట్లపై చర్చించనున్నారు. బండి చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రతో ఆయనకు మాత్రమే మైలేజ్వస్తున్నదని కొందరు నేతలు భావించినప్పటికీ అమిత్‌షా ఈ విషయమై పలు సూచనలు చేయడం విశేషం.
ఈ యాత్ర వెనుక కేంద్రం మాస్టర్ ప్లాన్ ఉందని రాష్ట్ర అధిష్టానానికి ఒక క్లారిటీ వచ్చింది. దీంతో ప్రతీ ఒక్కరూ బండి సంజయ్‌కి మద్దతు తెలపాల్సిందే అనే సంకేతాలు ఇచ్చినట్లయింది. రెండో విడత యాత్ర ఈనెల చివరి వరకు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈనెల 27న బండి సంజయ్ ఇందిరా పార్క్‌వద్ద నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేలా ప్రణాళికలు చేస్తున్నారు.