గుప్కార్‌ డిక్లరేషన్‌పై అమిత్ షా ఫైర్

by Shamantha N |   ( Updated:2020-11-17 08:01:38.0  )
గుప్కార్‌ డిక్లరేషన్‌పై అమిత్ షా ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైరయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లో బయట శక్తుల జోక్యాన్ని గుప్కార్ కోరుతున్నందున అలాంటి అపవిత్ర గ్లోబల్ ఘట్‌బంధన్‌ను ప్రజలు ఎంతకాలం ఉపేక్షించరన్నారు. త్రివర్ణ పతాకాన్ని అవమానించిన పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్‌కు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీని ట్విట్టర్ వేదికగా అమిత్ షా ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ, గుప్కార్ గ్యాంగ్ తిరిగి కాశ్మీర్‌లో ఉగ్రవాద భయాలు, కల్లోల శకంలోకి నెట్టివేయాలని అనుకుంటున్నాయని ఆరోపించారు. 370 రద్దు ద్వారా తాము దళితులు, మహిళలు, గిరిజనులకు కల్పించిన హక్కులను వారు లాక్కోవాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. భారత్‌లో ఎప్పటికీ జమ్మూ కాశ్మీర్ అంతర్భాగమేనన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ కలిసి పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్‌గా (పీఏజీడీ)గా ఇటీవల ఏర్పడిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed