- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరిశీలిస్తున్నాం.. సాయం చేస్తాం
దిశ, వెబ్‌డెస్క్: భారత్-చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు ఇరుదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఈమేరకు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత్- చైనా మధ్య క్లిష్ట సమస్య తలెత్తింది. ఇరు దేశాల సైనికులు తీవ్ర ఘర్షణకు దిగారు. ఇరువురితో మాట్లాడుతున్నాం. సమస్య త్వరలో పరిష్కారమయేలా వారికి సాయం చేస్తాం. ’’ అని ట్రంప్ అన్నారు.
కాగా, ప్రపంచం మొత్తం కరోనాపై పోరాడుతుంటే చైనా సరిహద్దు దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకుంటుందని ఇప్పటికే అమెరికా బాహాటంగానే దుయ్యబట్టింది. భారత్‌కు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. భారత్ సరిహద్దుల్లో చైనా సైన్యం ఉద్రిక్తతలు పెంచేలా వ్యవహరిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో శుక్రవారం విమర్శలు గుప్పించారు. చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు.