అమెరికన్ పీపుల్స్‌కు ట్రంప్ గుడ్‌న్యూస్

by vinod kumar |
Trump
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా ప్రజలకు అధ్యక్షుడు ట్రంప్ శుభవార్త వినిపించారు. రిపబ్లికన్ పార్టీ పాలన, కరోనా నివారణకు ట్రంప్ తీసుకున్న చర్యలు ఆయన్ను ఇరకాటంలో పడేశాయి. దీంతో ఆదివారం కొత్త నిర్ణయం తీసుకున్నారు. యువతకు ఉద్యోగాల కల్పనతో బాటు నిరుద్యోగులకు వారానికి 400 డాలర్ల భృతిని, విద్యార్థులకు రుణాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్దర్లపై ఆయన సంతకాలు చేశారు. ఈ సొమ్మును సాధ్యమైనంత త్వరగా వారికి పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఓటర్లను, ముఖ్యంగా యువతను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. దేశంలో కోవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో ఈయన ప్రభుత్వం విఫలమైందని డెమొక్రాట్లతో బాటు అనేకమంది విమర్శిస్తుండగా.. డ్యామేజీ కంట్రోల్ కోసం ట్రంప్ ఈ మేరకు నిర్ణయించారు.

న్యూజెర్సీలోని గోల్ఫ్ క్లబ్ బాల్ రూమ్‌లో ఆయన ఈ పత్రాలపై సంతకాలు చేశారు.అలాగే ఏడాదికి లక్ష డాలర్ల కన్నా తక్కువ ఆదాయం పొందుతున్నవారికి ‘పే రోల్ టాక్స్ హాలిడే’ ని కూడా ఆయన ప్రకటించారు. అయితే , అమెరికన్ల సమస్యలను సజావుగా పరిష్కరించే బదులు.. ట్రంప్ గోల్ఫ్ కోర్సులో.. బలహీనమైన, పని చేయని ఇలాంటి పాలసీని ప్రకటించడం వల్ల ఫలితం లేదని చక్ షమర్ వంటి సెనేటర్లు దుయ్యబడుతున్నారు.ఇదిలా ఉండగా, అమెరికాలో కరోనా కేసులు విలయతాండవం చేస్తున్నాయి. లక్షకు పైగా ప్రజలు గా కరోనా బారిన పడి మరణించగా, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయి యువత నిరాశలో ఉన్నారు.

Advertisement

Next Story