అమెరికాను భయపెట్టిస్తున్న చైనా విత్తనాలు

by vinod kumar |
అమెరికాను భయపెట్టిస్తున్న చైనా విత్తనాలు
X

దిశ, వెబ్‌డెస్క్ :
అమెరికా తమపై విధిస్తున్న ఆంక్షలు, వాణిజ్య యుద్దాన్ని ఎదుర్కొనేందుకు చైనా ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా ఇటీవల హానికరమైన, అరుదైన విత్తనాలను అమెరికాకు ఎగుమతి చేసింది. అయితే, వాటిని నాటరాదని నిపుణులు హెచ్ఛరిస్తున్నా వినకుండా కొందరు వ్యక్తులు వీటిని నాటుతున్నారు.

ఆర్కాన్సస్‌లో ఓ వ్యక్తి తన గార్డెన్ చైనా విత్తనాలు నాటాడు. ప్రతి రెండు వారాలకోసారి ఆ మొక్కల ఎదుగుదలను చూస్తూ ఆశ్ఛర్యపోయాడు. అవి ఇతర మొక్కల మాదిరిగా కాకుండా పొదల్లా విస్తరిస్తూ వచ్చాయి. ఒకే ఒక తెల్లని పండు, ఆరెంజ్ రంగు పూలు, పెద్ద ఆకులతో విచిత్రంగా కనిపించాయి.

ఈ మొక్కలు ‘ఇన్వెజీవ్ స్పీసీస్’ (ఆక్రమణ గుణం కలిగిన మొక్కల జాతి) అని వృక్షశాస్త్రజ్ఞులు నిర్ధారించారు. ఇవి క్రిమి సంహారక మందులకు కూడా నశించవని, ఇతర మొక్కలను, పంటలను నాశనం చేస్తాయని వారు హెచ్ఛరిస్తున్నారు. ఈ విత్తనాలు దుర్వాసనతో కూడినవని, ఎవరికి వీటి ప్యాకేజీలు అందినా వెంటనే వ్యవసాయ శాఖ సెంటర్లకు పంపాలని వారు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed