- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబులెన్స్ డ్రైవర్‌కు కరోనా.. హుజుర్‌నగర్‌లో కలకలం
దిశ, నల్లగొండ: హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న హుజుర్‌నగర్ మండలం బూరుగడ్డ వాసికి కరోనా సోకినట్లు తేలింది. మేడ్చల్‌లో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సదరు వ్యక్తి మార్చి 23న ఉగాది పండుగ పురస్కరించుకుని భార్యాపిల్లలతో స్వగ్రామం బూరుగడ్డకు వచ్చాడు. నాలుగు రోజులపాటు అక్కడే ఉండి తిరిగి ఒక్కడే హైదరాబాద్ వెళ్ళాడు. మళ్ళీ ఏప్రిల్ 5న బూరుగడ్డకు వచ్చి భార్యాపిల్లలను తీసుకుని మహబూబ్‌బాద్ జిల్లా బయ్యారంలోని అత్తగారింట్లో వదిలి, డ్యూటీ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాడు. కాగా, అతని నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించిన గాంధీ వైద్యులు కరోనా సోకినట్లు నిర్దారించారు. ఈ సమాచారాన్ని జిల్లా వైద్యాధికారులకు తెలుపగా వారు స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. మంగళవారం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందం బూరుగడ్డలో పర్యటించింది. కరోనా సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్నవారి వివరాలు సేకరించింది. మండల వైద్యాధికారి లక్ష్మణ్ వారందరికీ ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు, నలుగురు స్నేహితులకు కౌన్సిలింగ్ నిర్వహించి, హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు.
Tags : carona positive, hyd, burugadda, ambulence driver, gandhi docters