మహాశయా.. మది నిండా మీరే..

by Shyam |
మహాశయా.. మది నిండా మీరే..
X

దిశ, హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఈ రోజు ఆ మహానీయుని జయంతి. అయితే, నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా దేశమంతా లాక్ డౌన్ నడుస్తున్న తరుణంలో ఈ ఏడాది ఆ ఆదర్శమూర్తి జయంతిని వేడుకలాగా నిర్వహించుకునే పరిస్థితులు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు, ఉన్నతాధికారులు ఎక్కడికక్కడే వారి ఇళ్లు, కార్యాలయాల్లో వ్యక్తిగతంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు.

అంబేద్కర్ జయంతి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో చౌరస్తాలోకి వచ్చి ఆ మహానీయుని విగ్రహానికి పూలదండ వేయలేకున్నా ఇళ్లల్లోనే బాబా సాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు దళిత, బహుజన వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు. ‘‘ఓ మహాశయా.. మీరు చూపించిన మార్గం వల్లే మాకు ఉద్యోగాలు వచ్చాయి. మీ దారి మాకు టార్చిలైటు వంటిదనీ, మీ వల్లనే నిమ్న వర్గాలు అభివృద్ధి సాధిస్తున్నాయి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మేం సంబరాలు చేసుకోకున్నా.. మా మది నిండి మీరే ఉంటారంటూ అంబేద్కర్‌కు 129వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నారు.

Tags: Ambedkar Jayanti celebrations, at home only, covid 19 affect, lockdown

Advertisement

Next Story

Most Viewed