'మా ఊరు వస్తే రాళ్లు వేస్తాం.. మీ ఊరు వస్తే కాళ్లు పట్టుకుంటాం అంటే ఎలా?'

by srinivas |
YSRCP-MLA-1
X

దిశ, ఏపీ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. బద్వేలు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన టీడీపీ-జనసేన లోపాయకారి కుట్రలు కొనసాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. జనసేన కార్యకర్తలు బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. జనసేన అధినేతకు నిజాయితీ ఉందా అని ప్రశ్నించారు. చనిపోయిన అభ్యర్థి వెంకట సుబ్బయ్య కుటుంబంపై సానుభూతితో పోటీకి దూరంగా ఉన్నాం అన్న పవన్ కల్యాణ్ ఇప్పుడేంటి ఈ నీతిమాలిన రాజకీయం అని ప్రశ్నించారు. అమిత్‌ షాపై రాళ్లు వేసిన ఘటన ఆయనకు గుర్తుండదా.. అందుకే చంద్రబాబుకి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. మా ఊరు వస్తే రాళ్లు వేస్తాం.. మీ ఊరు వస్తే కాళ్లు పట్టుకుంటాం అంటే ఎలా..? అంటూ చంద్రబాబుపై అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed