- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్‌తో రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా రాయబారి కాట్రిన్ కివి భేటి
దిశ, తెలంగాణ బ్యూరో : రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా రాయబారి కాట్రిన్ కివి మంగళవారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. తెలంగాణ-రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా సత్సంబంధాలు, సైబర్ సెక్యూరిటీ ప్రోత్సాహకానికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చెయిన్ వంటీ రంగాలతో పాటు రాష్ట్రంలో సత్సంబంధాలను మరింతగా పెంపొందించుకోవడానికి తీసుకోవాల్సిన అంశాలపై అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించే అంశాలను ప్రస్తావించారు.
స్టార్టప్ వైవీ ఫానిరాజ్ హైదరాబాద్ యూరప్‌లోని అత్యంత డిజిటల్ దేశం రిపబ్లిక్ఆఫ్ ఎస్టోనియా, 2018లో తెలంగాణ సహకార ఒప్పందం కోసం సంతకాలు చేసినట్లు రాయబారి కాట్రిక్ కివి తెలిపారు. అదే విధంగా పర్యావరణ వ్యవస్థ బలోపేతం చేయడంలో పరస్పర సహకారం కోసం అవకాశాలు, డిజిటలైజేషన్ మరియు అభివృద్ధి చెందుతున్న టెక్ అప్లికేషన్స్ తదితర అంశాలను ఒప్పందంలో చేర్చినట్లు తెలిపారు.
సైబర్ సెక్యూరిటీ కెపాబిలిటీలను ప్రోత్సహించడానికి మేము ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు. సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు,వాణిజ్య (ఐఅండ్ సీ) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) విభాగాల ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులున్నారు.