- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెజాన్ ప్రైమ్ ఇయర్లీ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్!
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతపడటంతో.. ఓటీటీల హవా నడుస్తోంది. ప్రస్తుతం విడుదలకు సిద్ధమైన సినిమాలన్నింటికీ ఓటీటీలే మార్గంగా కనిపిస్తుండటంతో ఓటీటీలు చూసే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఓటీటీల మధ్య కూడా పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే.. తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు అమెజాన్.. ఇయర్లీ సబ్‌స్క్రిప్షన్‌పై డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది.
అమెజాన్ ప్రైమ్ ఇయర్లీ సబ్‌స్క్రిప్షన్ రేటు సాధారణంగా రూ.999/-. కాగా, ప్రస్తుతం రూ.100 డిస్కౌంట్ ఇస్తుండటంతో రూ.899/-కే అందుబాటులో ఉంది. కానీ ఇక్కడ కొన్ని షరతులను విధించింది. అవేంటంటే.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉండి.. ఆటో రెన్యూవల్ ఆప్షన్ లేకుండా మరికొన్ని రోజుల్లో ఆఫర్ అయిపోయే కస్టమర్ల కోసం ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. అంటే రెన్యూవల్ చేసుకునే కస్టమర్లకే ఇది వర్తిస్తుంది. అలాగే గతంలో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉండి.. ఏవో కారణాలతో దీన్ని రెన్యూవల్ చేసుకోని కస్టమర్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఈ ఆఫర్ వర్తిస్తుందో లేదో అమెజాన్.ఇన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇక నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 129/- మాత్రం అలాగే కొనసాగుతుందని సంస్థ వెల్లడించింది. ప్రైమ్ ఇయర్లీ సబ్‌స్క్రిప్షన్‌పై ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ గేమింగ్‌కు ఉచిత యాక్సెస్ అందించనుంది.