- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amazon Primeday:అమెజాన్ భారీ 'ప్రైమ్ డే సేల్' ఈ నెలలోనే
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా భారీ సేల్‌ను ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఉన్నట్టుగానే మెగా ‘ప్రైమ్ డే సేల్’ పేరుతో ఈ నెల 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపింది. మొదటి ఈ సేల్‌ను జూన్‌లోనే చేపట్టాలని అనుకున్నప్పటికీ కరోనా వల్ల వాయిదా పడింది. ఈ సేల్‌ను నిర్వహించడం ద్వారా కరోనా మహమ్మారి కారణంగా నష్టాలను ఎదుర్కొన్న చిన్న వ్యాపారులు, తయారీదారులు, చేనేత కార్మికులు, స్టార్టప్ కంపెనీలు, మహిళా పారిశ్రామికవేత్తలు, స్థానిక దుకాణాదారులకు ఎంతో ఉపయోగపడుతుందని అమెజాన్ ఓ ప్రకటనలో వివరించింది.
ఈ ‘ప్రైమ్ డే సేల్’లో భాగంగా అమెజాన్ సంస్థ టీవీలు, ఇతర గృహోపకరణాలతో పాటు మొబైల్‌ఫోన్‌లపైన భారీగా డిస్కౌంట్లను, ఆఫర్లను అందించనుంది. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులు, ఈఎంఐ చెల్లింపులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్6ను ఇవ్వనున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా ఈ సేల్‌లో కొత్తగా 300పైగా ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇక, అమెజాన్ పే ద్వారా చెల్లింపులు చేసిన వారికి రూ. వెయ్యి క్యాష్‌బ్యాక్ ఉన్నట్టు పేర్కొంది. ఈ సేల్‌కు సంబంధించి ఈ నెల 8-24 తేదీల మధ్య అమ్మకందారులతో ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్టు అమెజాన్ వెల్లడించింది.