అమెజాన్ ఇయర్-ఎండ్ సేల్.. ఈ ఫోన్లపై భారీ తగ్గింపు

by Harish |   ( Updated:2021-12-27 07:50:22.0  )
amazon year
X

దిశ, వెబ్‌డెస్క్: 2021 ముగుస్తున్న తరుణంలో ఈ-కామర్స్ సంస్థలు కస్టమర్స్‌ని ఆకర్షించడానికి కొత్త కొత్త ఆఫర్స్ ఇస్తున్నాయి. అందులో భాగంగా దిగ్గజ ఆన్‌లైన్ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అనేక ఆఫర్‌లను అందిస్తోంది. ప్రముఖ టెలివిజన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు వంటి అనేక టాప్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అమెజాన్ తన సంవత్సరపు చివరి విక్రయాన్ని ప్రారంభించింది. ఇయర్-ఎండ్ సేల్ 2021 సందర్భంగా ఫోన్‌లు, టీవీలు ఇతర ఎలక్ట్రానిక్స్‌పై మంచి డీల్‌లు, తగ్గింపులు, ఆఫర్‌లను అందిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI వంటి సదుపాయాలను అందిస్తోంది. అమెజాన్ ఇయర్-ఎండ్ సేల్ 2021లో అందించే ఆఫర్స్..

Xiaomi 11 Lite NE 5G- అమెజాన్‌లో ఇయర్-ఎండ్ సేల్‌లో భాగంగా కస్టమర్లు ఈ ఫోన్‌ను రూ.24,500కి పొందవచ్చు. ICICI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లతో రూ.2500 అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా, ఈ ఫోన్‌ను రూ.19,950 వద్ద పొందవచ్చు.

Samsung Galaxy M52 5G- అమెజాన్‌ Samsung Galaxy M52 5G Blazing Black, 6GB RAM, 128GB వేరియంట్‌ను రూ.29,000కి అందిస్తోంది. ఎక్స్‌ట్రాగా రూ.2500 తగ్గింపు. అమెజాన్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను ICICI క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే EMI రూ.1,412 నుండి, ఫ్లాట్ రూ.3000తో ప్రారంభమవుతుంది.

OnePlus Nord CE 5G- ఈ ఫోన్ రూ. 24,999కి లభిస్తుంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించే కస్టమర్‌లు రూ. 1,500 అదనపు తగ్గింపు పొందవచ్చు. కస్టమర్లు రూ.13,950 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు.

OnePlus Nord 2 5G (8GB)- అమెజాన్ ఇయర్-ఎండ్ సేల్ 2021 సందర్భంగా ఈ ఫోన్ రూ. 29,999కి విక్రయించబడుతోంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్‌లకు అదనంగా రూ.2000 ఫ్లాట్ తగ్గింపు ఉంది. పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.16,950 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు.

Redmi Note 10S- Amazon ఈ ఫోన్‌ను 2021 చివరి రోజుట్లో రూ.14,999 ధరకు విక్రయిస్తోంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ.1000 తక్షణ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. మరిన్ని అదనపు తగ్గింపుల కోసం, కస్టమర్లు రూ. 13,950 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు.

Advertisement

Next Story