‘కాఫీ రాసిన ప్రేమ కథ’.. ఫీల్ గుడ్ మూవీ!

by Jakkula Samataha |   ( Updated:2020-12-02 12:31:58.0  )
‘కాఫీ రాసిన ప్రేమ కథ’.. ఫీల్ గుడ్ మూవీ!
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘పాజిటివ్, నెగెటివ్ కలిస్తేనే పర్ఫెక్ట్ లైఫ్. లవ్‌కు పెద్దగా లాజిక్స్ అంటూ ఉండవ్. ఒక టేబుల్.. రెండు కాఫీ కప్పులు.. ఒక మనిషి కలిసి చేసే మిరాకిల్ ప్రేమగా మారవచ్చు’ అనే కాన్సెప్ట్‌తో అద్భుతంగా మలిచిన షార్ట్ ఫిల్మ్ ‘కాఫీ రాసిన ప్రేమ కథ’.

చిన్నతంలోనే తండ్రిని కోల్పోయినప్పుడు.. పోతే ఎంత వస్తుంది? ఉంటే ఎంత పోతుంది? అన్న బంధువుల నెగెటివ్ క్యాలిక్యులేషన్ కారణంగా పాజిటివ్‌గా మారిన పురుషోత్తం.. పాజిటివ్ ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రతీసారి నెగెటివ్ ఎదురుకావడంతో ప్రతీ విషయంలోనూ నెగెటివిటీని వెతికే ఆకృతి.. ఓ కాఫీ షాప్‌లో కలుస్తారు. పెళ్లి చూపులకు వచ్చిన పురుషోత్తం అమ్మాయి కోసం వెయిట్ చేస్తుండగా.. ఆఫీస్ వర్క్ చేస్తూ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న ఆకృతికి లైఫ్‌లో పాజిటివ్‌గా ఉండాలనే విషయాన్ని ప్రాక్టికల్‌గా ఎలా చూపించాడు? పెళ్లి చూపుల కోసం వచ్చిన పాజిటివ్ మైండ్‌సెట్‌ గల అబ్బాయికి, పూర్తిగా నెగెటివ్ మైండ్‌సెట్‌తో ఉన్న ఆకృతి ఎందుకు నచ్చింది? కాఫీ పౌడర్ లాంటి అమ్మాయికి.. మిల్క్, షుగర్ లాంటి అబ్బాయి చేసిన ప్రపోజల్ నచ్చిందా? అప్పుడు అమ్మాయి రియాక్షన్ ఏంటి? ఇద్దరూ కలిస్తేనే పర్ఫెక్ట్ కాఫీ అని గుర్తించిందా.. పాజిటివ్, నెగెటివ్ కలిస్తేనే పర్ఫెక్ట్ లైఫ్ అని తెలుసుకుందా? లేక నెగెటివిటీతోనే సాగిపోతున్న ఆకృతి.. మరో అమ్మాయితో పెళ్లి చూపులకు వచ్చి, ఇలా తనకు ప్రపోజ్ చేయడం ఏంటని పాజిటివ్ పురుషోత్తంను రిజెక్ట్ చేసిందా? ప్రతీ అమ్మాయి విషయంలో ఇలాగే చేస్తావా అంటూ క్లాస్ పీకిందా? అయినా గంటలో ప్రేమ ఎలా పుడుతుంది? అన్న ఆకృతి ప్రశ్నకు పురుషోత్తం ఇచ్చిన సమాధానం ఏంటి? అన్నదే ‘కాఫీ రాసిన ప్రేమ కథ’.

లవ్ పుట్టాలంటే ఏదో మిరాకిల్ జరగాలి. చివరి దాకా మనతో ఉండే అనుబంధానికి కూడా చిన్న అనుభవమే కారణమన్న డైలాగ్స్ ఆకట్టుకోగా.. షార్ట్ ఫిల్మ్‌లో ప్రతీ పదం కూడా హార్ట్ టచింగ్‌గా ఉందంటున్నారు నెటిజన్లు. 20 నిమిషాల్లో ఫీల్ గుడ్ మూవీ అందించిన టీమ్‌ను అభినందిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, డీఓపీకి స్పెషల్ అప్రిషియేషన్ అందుతోంది.

టీమ్:

కాస్ట్: రాజ్ కుమార్ తోలేటి, చాందిని రావ్, తిమోతి దాసరి, సి.హెచ్. భాను ప్రసాద్

D.O.P: ఎన్. సతీష్ నాయక్

Music: పవన్

Producer: రాజ్ కుమార్ తోలెటి

Story – Screenplay- Dailogues- Direction : ఫణి పవన్ ఈమణి

Advertisement

Next Story

Most Viewed