- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లైవ్ డిబేట్‌లో బీజేపీ నేతపై చెప్పుతో దాడి
దిశ, వెబ్‌డెస్క్: టీవీ ఛానెళ్ల లైవ్ డిబేట్లలో పాల్గొని మాట్లాడుతున్న వారు ఆవేశానికి లోను కావడం.. వారి మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరడం.. ఒకరినొకరు దూషించుకోవడం చూస్తుంటాం. తాజాగా ఓ ఛానెల్లో ఊహించని పరిణామం చేసుకుంది. సహనం కోల్పోయి లైవ్ డిబేట్‌లోనే చెప్పుతో దాడి చేశాడు ఓ వ్యక్తి. ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ లైవ్ డిబేట్‌లో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి చెప్పుతో కొట్టడం తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది.
అమరావతికి సంబంధించిన అంశంపై లైవ్ డిబేట్ జరుగుతుండగా అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి శ్రీనివాస్‌ను పెయిడ్ ఆర్టిస్ట్ అని అన్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీనివాస్.. విష్ణువర్ధన్ రెడ్డిని ఉద్దేశించి మీరు జాతీయ పార్టీ నాయకులు అయి ఉండి ఇలా జగన్‌కు భజన చేస్తున్నట్లుగా మాట్లాడకూడదు అంటూ కౌంటర్ ఇచ్చారు. దానికి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. మరి మీ భజన చేయమంటారా, మీరు వెళ్లి టీడీపీ ఆఫీసులో పని చేసుకోండి అంటూ వ్యాఖ్యానించారు. దీంతో రెచ్చిపోయిన శ్రీనివాస్ ఏం మాట్లాడుతున్నావ్ అంటూ కాలి చెప్పు తీసి చేత్తో పట్టుకున్నారు. వెంటనే అప్రమత్తమైన యాంకర్ శ్రీనివాస్ చెయ్యి పట్టుకుని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ, ఆయన విష్ణువర్ధన్ రెడ్డి మీదకు చెప్పు విసిరారు.
బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై దాడిని పార్టీ శ్రేణులు సీరియస్‌గా తీసుుకున్నాయి. ఈ దాడిని బీజేపీ నేతలు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు ఖండించారు. శ్రీనివాస్‌కు టీడీపీతో అనుబంధం ఉందని.. ఈ దాడిని చంద్రబాబు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీన్ని విష్ణువర్ధన్ రెడ్డిపై జరిగిన దాడిగా మాత్రమే చూడలేమని… తమ పార్టీపై జరిగిన దాడిగా భావిస్తున్నామని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు.
ఈరోజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ నందు లైవ్ డిబేట్ లో పాల్గొన్న మా @BJP4Andhra రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. @SVishnuReddy @JPNadda @blsanthosh @VMBJP @BJPMadhukarAP @Sunil_Deodhar @narendramodi @APPOLICE100 pic.twitter.com/JhyfrYrssl
— Somu Veerraju (@somuveerraju) February 23, 2021
ఈరోజు ABN ఛానల్ లో @BJP4Andhra @SvisnuReddy గారిపై శ్రీనివాస్ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది టీడీపీ ప్రాయోజిత చర్యగా స్పష్టంగా తెలుస్తోంది. శ్రీనివాస్ టీడీపీ సంబంధం తెలిసిందే. మాకు సంబంధం లేదని టీడీపీ అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాస్ చర్యను ఖండించవలసిందే https://t.co/XavZc01GYX
— GVL Narasimha Rao (@GVLNRAO) February 23, 2021