- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆయుర్వేదం, అదృష్టమే కరోనా నుంచి సేవ్ చేసింది : అల్లు శిరీష్
దిశ, వెబ్‌డెస్క్ : మెగా ఫ్యామిలీ హీరోస్ రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్‌లకు కరోనా పాజిటివ్ రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. చెర్రీ ఇచ్చిన క్రిస్మస్ పార్టీకి హాజరైన మెగా కజిన్స్ అందరికీ కూడా కరోనా వస్తుందని ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలోనే దీనిపై క్లారిటీ ఇచ్చారు అల్లు శిరీష్. రెండుసార్లు కరోనా టెస్ట్‌లు చేయించుకున్నానని.. రెండుసార్లు నెగెటివ్ వచ్చిందని తెలిపారు. అయితే కొవిడ్ 19 గురించి ఓ విషయం పంచుకోవాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు. ‘పెళ్లిళ్లకు అటెండ్ అయ్యాను, ఔట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్లాను. ఈ క్రమంలో మాస్క్ ధరించాను, శానిటైజర్లు యూజ్ చేశాను. కానీ ఇవేవీ కొవిడ్ క్యారియర్‌తో టచ్‌లో ఉండకుండా చేయలేవు. అందుకే తనను సేఫ్‌గా ఉంచింది ఆయుర్వేదం, అదృష్టమే’ అని నమ్ముతున్నాను అన్నాడు.
I have attended a wedding, traveled outdoor & shooting everyday with 100 odd people. I wear a mask, use sanitizers & take precautions. But it's practically impossible not to come in contact with any Covid carrier.
What kept me safe I believe is Ayurveda and some good luck.— Allu Sirish (@AlluSirish) December 30, 2020
వంద సంవత్సరాల క్రితం వరకు మనిషి.. పాములు, గబ్బిలాలు, ఎలుకలతో తన స్థలాన్ని పంచుకున్నాడని.. వాటి ద్వారా వ్యాపించే వ్యాధుల నుంచి మనని మనం రక్షించుకునేందుకు మన పూర్వీకులు ఇప్పటికే నివారణలను కనుగొన్నారని తెలిపాడు సిరి. సురక్షితమైన టీకా వచ్చేవరకు, మాస్క్‌లు మాత్రమే కాకుండా ఆరోగ్యంగా ఉండటానికి సాంప్రదాయ పద్ధతులు ఫాలో కావాలని సూచించారు.