ఆటో డ్రైవర్‌గా అల్లు శిరీష్.. మాస్ డ్యాన్స్‌తో మస్తీ

by Shyam |   ( Updated:2023-12-17 17:23:09.0  )
allu shirish
X

దిశ, సినిమా: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రదర్ అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’ చిత్రం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. కొన్నాళ్లుగా నెక్స్ట్ మూవీస్ ప్లానింగ్‌లో ఉన్న శిరీష్.. తాజాగా ఓ హిందీ మ్యూజిక్ ఆల్బమ్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ‘విలాయటి శరాబ్’ అనే పేరుతో రూపొందిన ఈ సాంగ్‌లో యాక్ట్రెస్ హీలీ దారువాలాతో కలిసి మాస్ స్టెప్పులు వేశాడు. ఈ రోజే(సోమవారం) విడుదలైన ఈ మ్యూజిక్ వీడియోలో శిరీష్ ఆటో డ్రైవర్ గెటప్‌లో కనిపించడం విశేషం. నౌషాద్ ఖాన్ సమర్పించిన ఈ పార్టీ సాంగ్‌కు ఆదిల్ షేక్ కొరియోగ్రఫీతో పాటు డైరెక్షన్ కూడా చేశారు. లిజో జార్జ్, డీజే చేటాస్ కంపోజిషన్‌లో దర్శన్ రావల్-నీతి మోహన్ పాడిన పాటకు కుమార్ లిరిక్స్ అందించారు. కాగా సాంగ్‌లో శిరిష్ వేసిన స్టెప్స్.. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

Advertisement

Next Story