హీరోల మధ్య చిచ్చుపెడుతున్న పూజా హెగ్డే.. ఆ హీరో అభిమానులు ఫైర్

by Shyam |   ( Updated:2021-12-07 01:25:01.0  )
హీరోల మధ్య చిచ్చుపెడుతున్న పూజా హెగ్డే.. ఆ హీరో అభిమానులు ఫైర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌ పూజా హెగ్డే ట్విట్టర్ పోస్ట్ అల్లు అర్జున్ అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తుంది. సోమవారం ‘ఆర్ఆర్ఆర్’ నుంచి విడుదలైన ఎన్టీఆర్, చరణ్‌ల ఇంటెన్సివ్ పోస్టర్స్ చూసిన పూజ.. ‘రాజమౌళి చేసిన ఈ ఎమోషనల్ డ్రైవ్‌ను చూసేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. రామ్ చరణ్, ఎన్టీఆర్‌ ఇద్దరూ కూడా ఫెంటాస్టిక్‌గా కనిపిస్తున్నారు.

ఇద్దరినీ ఒకేసారి స్క్రీన్ మీద చూసేందుకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాను’ అంటూ ట్వీట్ చేసింది. కాగా ఈ ట్వీట్‌తో బన్నీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ‘పుష్ప’ ట్రైలర్ ఇన్‌టైంలో రిలీజ్ కాకపోవడం.. పూజా ఇతర హీరోలను ప్రేజ్ చేయడం తట్టుకోలేని ఫ్యాన్స్.. ‘నువ్వు కొంచెం తగ్గిస్తావా? అన్నదమ్ముల మాదిరిగా ఉన్న తారక్, చరణ్, బన్నీ అభిమానుల మధ్య ఎందుకు చిచ్చు పెడుతున్నారు?’ అని మండిపడ్డారు.

కాబోయే దంపతులు కత్రినా-విక్కీ కౌశల్‌పై కేసు.

https://twitter.com/hegdepooja/status/1467889172698394625?s=20

Advertisement

Next Story

Most Viewed