అల్లరోడి సర్‌ప్రైజ్ టీజర్.. ‘నాంది’

by Shyam |
అల్లరోడి సర్‌ప్రైజ్ టీజర్.. ‘నాంది’
X

‘ఒక మనిషి పుట్టడానికి కూడా తొమ్మిది నెలలే టైమ్ పడుతుంది.. కానీ నాకు న్యాయం చెప్పటానికి ఎందుకు సార్ ఇన్నేళ్ల టైమ్ పడుతుంది? అని ప్రశ్నిస్తూ తన ‘నాంది’ సినిమా టీజర్‌తో ఆసక్తి రేపుతున్నారు అల్లరి నరేష్. కామెడీ సినిమాలతో మినిమం గ్యారంటీ హీరోగా గుర్తింపు పొందిన అల్లరి నరేష్.. అల్లరి పాత్రలనే కాదు, ఏ పాత్రలోనైనా మెస్మరైజ్ చేయగలనని ఇంతకు ముందే చాలా సార్లు రుజువు చేశాడు. కానీ అంతకు మించిన నటనను ప్రదర్శిస్తూ.. నాంది టీజర్‌తో సర్‌ప్రైజ్ చేశాడు.

విజయ్ కనక మేడల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ఖైదీగా కనిపిస్తున్న నరేష్.. తను ఎందుకు శిక్ష అనుభవిస్తున్నాడో కూడా తెలియని పాత్రతో ఆకట్టుకున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియదర్శి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

నవ్వించే నటుడే ఎక్కువగా ఏడిపించనూ గలడు అనేందుకు ఈ ‘నాంది’ ట్రైలర్ ఉదాహరణ కాగా.. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ నిజంగా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.

Advertisement

Next Story

Most Viewed