- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర చట్టాలను వ్యతిరేకించండి: అల్లం నారాయణ
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రం ప్రవేశపెడుతున్న నల్ల చట్టాలను వ్యతిరేకించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లం నారాయణ మాట్లాడుతూ.. మోడీ రెండోసారి ప్రధానిగా అయ్యాక ఫెడరల్ విధానాలను ప్రవేశపెడుతున్నారని విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో నేటికీ రైతుల ధర్నా కొనసాగుతూనే ఉందన్నారు. ఇది ప్రపంచంలోనే రైతులు చేస్తున్న అతి పెద్ద పోరాటమని ఆయన చెప్పారు. రైతులకు తోడు ఒకవైపు పెగాసెస్, మరో వైపు జంతర్ మంతర్ వద్ద విద్యుత్ ఉద్యోగుల ధర్నా చేపడుతూ కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నా ఇలాంటి చర్యలకు దిగడం సరికాదన్నారు.