ప్రెస్‌క్లబ్‌లపై కరోనా ప్రభావం

by Shyam |   ( Updated:2020-03-16 05:26:54.0  )
ప్రెస్‌క్లబ్‌లపై కరోనా ప్రభావం
X

దిశ, హైదరాబాద్ : కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించగా, నిత్యం రద్దీగా ఉండే పబ్బులు, మాల్స్, సినిమా హాల్స్, పార్కులు ఇలా అన్నింటిని ముందస్తుగా మూసివేయించారు. అదే బాటలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు, సభలు, సమావేశాలు, నిరసన ప్రదర్శనలకు ఈనెల31వరకు పర్మిషన్లను ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీంతో కరోనా ప్రభావం సమాజంలోని అన్ని రంగాలు, విభాగాలపై పడింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సైతం రద్దయింది. అత్యవసరమైన ఫిర్యాదుల కోసం మాత్రమే కలెక్టరేట్‌కు రావాలని కలెక్టర్ శ్వేతా మహంతి ప్రజలకు సూచించారు. కరోనా భయంతో రాజకీయ,సామాజిక సంస్థలు తమ కార్యకలాపాలు సాగించేందుకు ముందుకు రాకపోవడంతో మూగబోయాయి. అన్నింటికంటే ముందుగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రవీంద్రభారతిలో ఈ నెల 31 వరకు వివిధ కార్యక్రమాలను రద్దు చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లు కూడా ప్రెస్‌మీట్‌లు, సమావేశాలను రద్దు చేసుకున్నాయి. కాగా, ఒక్క సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాత్రం సోమవారం నాలుగు ప్రెస్‌మీట్లు నిర్వహించారు.

Tags: carona effect, all press clubs close excpet somajiguda, movie halls, parks, auditorims close

Advertisement

Next Story