- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోణి కొట్టిన ప్రధాన పార్టీలు
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు బోణీ కొట్టాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంల మధ్య రసవత్తరంగా సాగిన పోరులో అన్ని పార్టీలు తమ ఖాతాలను ప్రారంభించాయి. మధ్యాహ్నం వరకూ సాగిన ఓట్ల లెక్కింపులో ఆయా పార్టీలు తమ తొలి గెలుపులను సాధించాయి. వంద స్థానాల్లో టీడీపీ పోటీ చేసినప్పటికీ.. ఆ పార్టీకి నాయకత్వ లోపం ఎన్నికల ఫలితాల్లోనూ స్పష్టమవుతోంది.
బల్దియాలో తొలి కార్పొరేటర్ ఫలితం మొట్టమొదటి మెహదీపట్నం నుంచి వెలువడింది. ఈ స్థానంలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపొందారు. రెండో ఫలితంలో టీఆర్ఎస్ యూసుఫ్ గూడ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ గెలుపొందగా.. కాంగ్రెస్ నుంచి ఏఎస్ రావు నగర్‌లో శిరీషా రెడ్డి తొలి గెలుపును ఆ పార్టీకి అందించారు. బీజేపీ పార్టీకి తొలి విజయాన్ని అభ్యర్థి నవజీవన్ రెడ్డి హయత్ నగర్ నుంచి అందించారు. బీజేపీ 146 స్థానాల్లో పోటీ చేయగా.. మొదటి కార్పొరేటర్‌ను గెలుచుకుంది. ఇప్పటి వరకూ పోటీలోని మూడు ప్రధాన పార్టీలు తమ తొలి కార్పొరేటర్లను బల్దియాకు పంపించగలిగాయి.