ఏడాదిలో 'జాక్ మా' నష్టాలు 344 బిలియన్ డాలర్లు!

by Harish |
jack ma
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు, చైనాకు చెందిన బిలీయనీర్ జాక్ మా అనూహ్య రీతిలో కష్టాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. గతేడాది అనుకోకుండా తాను చేసిన వ్యాఖ్యల కారణంగా చైనా ప్రభుత్వం ఆగ్రహానికి గురైన జాక్ మా భారీ నష్టాల పాలయ్యారు. ఇప్పటివరకు ఏడాది కాలంలో జాక్ మా ఏకంగా 344 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 25.8 లక్షల కోట్ల) నష్టాలను ఎదుర్కొన్నారు.

2020లో ఓ సమావేశంలో పాల్గొన్న జాక్ మా చైనా బ్యాంకింగ్ వ్యవస్థలో అనేక లోపాలున్నాయని, భారీ ఎత్తున మార్పులు అవసరమని వ్యాఖ్యానించారు. అయితే, దీనిపై ఆగ్రహించిన చైనా ప్రభుత్వం జాక్ మాకు చెందిన అన్ని రకాల వ్యాపారాలపై కఠిన ఆంక్షలు విధించింది. జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్ ఐపీఓ నిర్వహణను కూడా నిలిపేసింది. ఈ కారణంతో అలీబాబా కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. కేవలం అలీబాబా కంపెనీ షేర్లు మాత్రమే కాకుండా దాని అనుబంధ కంపెనీల షేర్లు సైతం కుప్పకూలాయి. ఈ కారణంగానే అలీబాబా వందల బిలియన్ డాలర్లు పోగొట్టుకున్నారని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది.

Advertisement

Next Story