విద్యార్థులు చనిపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లా : అలీ ఫజల్

by Shyam |
Ali Fazal Reveals
X

దిశ, సినిమా : యాక్టర్ అలీ ఫజల్ ‘3 ఇడియట్స్’ సినిమాలో చిన్న పాత్ర ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్ జాయ్ లోబో క్యారెక్టర్‌లో కనిపించిన అలీ ఫజల్.. సినిమాలో ప్రాజెక్ట్ సబ్మిషన్ డెడ్‌లైన్‌ పొడిగించేందుకు డీన్ నిరాకరించడంతో సూసైడ్ చేసుకుంటాడు. అలీ పర్ఫార్మెన్స్‌కు మార్కులు కొట్టేసినా, ఆ తర్వాత మంచి క్యారెక్టర్స్ లభించినప్పటికీ.. తాను విన్న వార్తలతో డిప్రెషన్‌లోకి వెళ్లానని చెప్పాడు.

మూవీలో ఎలాగైతే జరిగిందో కొంత మంది స్టూడెంట్స్ కూడా అలాగే ఆత్మహత్య చేసుకున్నారని కొన్ని మీడియా సంస్థల నుంచి కాల్ రావడంతో.. తన మనస్సు ముక్కలైపోయిందని తెలిపాడు. ఈ సంఘటనలు తన మెంటల్ హెల్త్‌పై ఎఫెక్ట్ చూపాయన్న అలీ ఫజల్.. తాను ఆ సమయంలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నానని తెలిపాడు. ఇక మీడియా సంస్థలు తనకు కాల్ చేస్తున్న విషయాన్ని డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీకి చెబితే.. వారిని నీకు కాకుండా నిర్మాతకు చేయమని చెప్పామంటూ సలహా ఇచ్చాడని వివరించాడు.

Advertisement

Next Story