ఫౌజీ ఆంథెమ్ విడుదల చేసిన అక్షయ్

by Shyam |
ఫౌజీ ఆంథెమ్ విడుదల చేసిన అక్షయ్
X

దిశ, వె‌బ్‌డెస్క్ : ఆర్మీ నేపథ్యంలో సాగే ‘ఫౌజీ గేమ్’‌కు బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ గేమ్ టీజర్‌లో భారత సైనికుల పరాక్రమాన్ని చూపించగా, తాజాగా ఫౌజీ గేమ్‌కు సంబంధించిన సాంగ్‌ను అక్షయ్ తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశాడు. ‘సమస్య అనేది దేశంలో ఉన్నా, సరిహద్దుల్లో ఉన్నా.. మన భారత సైనికులు ముందుండి పోరాడుతున్నారు. బెరుకు లేకుండా సంయుక్తంగా యుద్ధం చేస్తున్నారు. వారి ధైర్యసాహసాలకు నిదర్శనమే ఈ గీతం’ అంటూ పేర్కొన్నాడు అక్షయ్. కాగా ఈ యానిమేషన్ వీడియో గేమ్‏ను జనవరి 26 విడుదల చేయనున్నట్లు తెలిపారు.

చైనాకు చెందిన పబ్జీ గేమ్‌పై నిషేధం విధించిన సంగతి తర్వాత ‘ఫౌజీ’ గేమ్‌ను తీసుకొస్తున్నట్లు బెంగళూరుకు చెందిన భారతీయ సంస్థ ఎన్ కోర్ గేమ్స్ (nCore Games) గతేడాది ప్రకటించింది. అయితే ఫౌజీ (ఫియర్‌లెస్‌ అండ్‌ యునైటెడ్‌-గార్డ్స్‌) గేమ్ కేవలం వినోదం కోసమే కాకుండా, భారతీయ జవాన్ల త్యాగాలను ప్రతిబింబించేలా, దేశభక్తిని పెంపొందించేలా ఉంటుందని గేమ్ డెవలపర్స్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed