నాలోని ‘గే’ వెర్షన్‌ను నిజాయితీగా చూపించా : అక్షయ్

by Jakkula Samataha |
నాలోని ‘గే’ వెర్షన్‌ను నిజాయితీగా చూపించా : అక్షయ్
X

దిశ, సినిమా : బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ ‘లక్ష్మీ’ చిత్రంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు. మార్చి 21న ఈ చిత్రం స్టార్ గోల్డ్‌లో ప్రసారం కానుండగా.. ఈ క్యారెక్టర్‌లో జీవించిన విధానం కొత్తదనాన్ని పంచిందని తెలిపాడు. ‘లక్ష్మీ’ పాత్రలో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయన్న అక్షయ్.. ఆ క్యారెక్టర్ మాట్లాడే తీరు, నడిచే విధానం, డ్యాన్స్ ప్రతీ విషయంలోనూ గంటలకు గంటలు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేదని చెప్పాడు.

అయినా సరే క్యారెక్టర్ పర్‌ఫెక్ట్‌గా ఉండేందుకు హ్యాపీగా రీటేక్స్ ఇచ్చానని తెలిపాడు. ‘లక్ష్మీ’ తనకు ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అయిందని, టఫ్ అండ్ చాలెంజింగ్ క్యారెక్టర్‌ను బెస్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసేందుకు ట్రై చేశానని చెప్పాడు. తన 30ఏళ్ల బాలీవుడ్ కెరియర్‌లో చేయని ప్రయోగం ఈ సినిమా ద్వారా చేయడం సంతోషంగా ఉందన్న అక్షయ్.. ప్రేక్షకులకు తనలో ఉన్న న్యూ వెర్షన్‌(గే)ను ఇంట్రడ్యూస్ చేశానని, హానెస్టీగా పర్‌ఫార్మెన్స్ ఇచ్చానని వివరించాడు.

Advertisement

Next Story