- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వార్నర్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్.. షోయబ్ అక్తర్ సీరియస్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్ : టీ20 వరల్డ్ కప్ ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ముగిసింది. ఫైనలో కివీస్‌పై ఆస్ట్రేలియా సునాయాస విజయాన్ని అందుకుంది. దీంతో తొలిసారిగా టీ20 వరల్డ్ కప్‌ను ఆసీస్ తమ ఖాతాలో వేసుకుంది. అయితే వరల్డ్ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డును ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్‌వార్నర్ గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది సీరిస్ అవార్డుపై పాకిస్థాన్ దిగ్గజ బౌలర్, మాజీ ఆటగాడు షోయబ్అక్తర్అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ అవార్డు పాక్కెప్టెన్, ఓపెనర్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజామ్‌కు దక్కుతుందని భావించానని వ్యాఖ్యలు చేశాడు. వార్నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు ఇవ్వడం సరికాదని అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అయితే.. వరల్డ్ కప్‌లో బాబర్ఆజామ్ 6 మ్యాచ్‌ల్లో 303 పరుగులు చేయగా.. వార్నర్7 మ్యాచుల్లో 289 పరుగులు చేశాడు. వార్నర్‌కు ఈ అవార్డు దక్కడంపై ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ అవార్డు బౌలర్ఆడమ్ జంపాకు దక్కాల్సిందని అభిప్రాయపడ్డాడు. జంపా ఈ టోర్నీలో మంచి ఎకానమితో 13 వికెట్లు పడగొట్టాడు.
Was really looking forward to see @babarazam258 becoming Man of the Tournament. Unfair decision for sure.
— Shoaib Akhtar (@shoaib100mph) November 14, 2021