- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అఖిల ప్రియకు మళ్లీ నిరాశే..
దిశ, క్రైమ్ బ్యూరో : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితులురాలు ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్ పిటీషన్ విచారణ మళ్లీ రేపటికి వాయిదా పడింది. ఈ కేసులో ఇప్పటికే అఖిల ప్రియ అరెస్ట్ అయ్యి చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా, ఇదే కేసులో ఆమె భర్త భార్గవ్ రామ్ (ఏ2)తో పాటు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం అఖిల ప్రియ బెయిల్ పిటీషన్ విచారణలో ఉండగా.. భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలు ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు.
ఈ మూడు పిటీషన్లను వేర్వేరుగా పరిశీలించిన కోర్టు.. వీటిని మూడింటిని కలిపి విచారిస్తోంది. వీటిపై బుధవారం విచారణ కొనసాగించిన కోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేసింది. ఇవాళ కూడా బెయిల్ పిటీషన్లకు సంబంధించిన తీర్పును కోర్టు రేపటికి వాయిదా వేసింది. దీంతో బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియకు అసలు బెయిల్ వస్తుందా? రాదా? అనే సందిగ్దత నెలకొంది.