- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెర్రరిస్టులకు చెక్.. పాకిస్తాన్ ఎదుట అజిత్ దోవల్ ‘యాక్షన్’ ప్లాన్..
దుషాంబే: దాయాది దేశం పాకిస్తాన్ బేస్డ్ ఉగ్రవాద శిబిరాలకు చెక్ పెట్టడానికి జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ యాక్షన్ ప్లాన్ ప్రతిపాదించారు. తజకిస్తాన్ రాజధాని దుషాంబేలో బుధవారం జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో) సదస్సుకు ఆయన హాజరయ్యారు. సీమాంతర ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదాలపై కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరముందని సభ్య దేశాల భద్రత సలహాదారులు ప్రతిపాదన చేశారు. పాకిస్తాన్ భద్రత సలహాదారు మొయీద్ యూసుఫ్ ఎదుటే అన్ని రూపాల తీవ్రవాదాలపై దోవల్ మండిపడ్డారు. ఇతరదేశాలపై ఉగ్రవాద దాడులు, తీవ్రవాద ఘటనలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఉగ్రవాద సంస్థలు చేసే డ్రోన్‌ల ద్వారా ఆయుధ అక్రమ రవాణా, డార్క్ వెబ్, కృత్రిమ మేథ, బ్లాక్ చెయిన్, సోషల్ మీడియాల వినియోగాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షించాలని అన్నారు. టెర్రరిజాన్ని అరికట్టడానికి ఐరాస తీర్మానాలన్నింటినీ అమలు చేయాలని, అది గుర్తించిన ఉగ్రవాదులపై కఠిన ఆంక్షలు విధించాలని పేర్కొన్నారు. ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహాయంపైనా కఠినంగా వ్యవహరించాలని, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రమాణాలను పాటించాలని వివరించారు. 2017లో ఇండియా, పాకిస్తాన్‌లు ఎస్‌సీవో శాశ్వత సభ్య దేశాలుగా చేరాయి. నాటోకు కౌంటర్‌గా భావించే ఈ కూటమిలో చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లూ సభ్యదేశాలుగా ఉన్నాయి.